ముంబై: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్).
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిషేధం విధించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం1949 సెక్షన్ 22(3)(బి), (సి), (ఇ), (జి)ను ఉల్లంఘించింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాపారం నడిపించడం, మేనేజ్మెంట్ ప్రజా ప్రయోజనాలకు హానికరంగా ఉండటం, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో లైసెన్స్ రద్దు చేసింది. ఇది డిపాజిటర్ల భద్రతకు ముప్పు కలిగించింది.
ఈ నిషేధం,ఏప్రిల్ 24, 2026 పని వేళలు ముగిసిన తర్వాత (క్లోజ్ ఆఫ్ బిజినెస్) నుంచి అమలులోకి వచ్చింది. అంటే ఏప్రిల్ 24, 2026 తేదీ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు, లావాదేవీలు మొ.) నిర్వహించకూడదు. రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో బ్యాంక్ వైండింగ్ అప్ (మూసివేత) కోసం దరఖాస్తు చేస్తుంది.
: నిషేధం ఎందుకు?
పేటీఎం 2024 జనవరి,31 నుంచి ఆర్బిఐ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా, ఫిబ్రవరి 29, 2024 నుంచి డిపాజిట్లు, టాప్-అప్లు నిషేధించింది. కొత్త ఖాతాదారులు పై 2022 మార్చి 11 నుంచి ఆంక్షలు ఉన్నాయి. ఈ నిబంధనలు పాటించకపోవడంతో నిషేధం విధించారు.
