Skip to main content

Telugu News Power

ఢిల్లీలో తెలుగు ప్రముఖులకు సత్కారం. కేంద్రమంత్రి వర్మ అభినందనలు.

పురస్కార ఉవత్సవంలో పాల్గొన్న ప్రముఖులు
ఆక్వా రైతు నాయకుడు ఉద్ద రాజు ను సత్కరిస్తున్న మంత్రి వర్మ

న్యూఢిల్లీ: జులై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా, మంగళవారం ఢిల్లీలో‘జాతీయ తెలుగు సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ తెలుగు వెలుగు సంబరాలు” కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సభాధ్యక్షతన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. విశిష్టమైన ప్రజా సేవ చేసిన ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పితాని సత్యనారాయణ, ఆక్వా రంగానికి విశేష సేవలు అందించిన ఉద్దర్రాజు విశ్వనాథరాజు, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జాతీయ తెలుగు సారస్వత పరిషత్‌ బృందానికి కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్, బీద మస్తాన్ రావు, మాగుంట శ్రీనివాసులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సత్కరిస్తున్న కేంద్రమంత్రి వర్మ