
భీమవరం: జూలై, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్)
డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్-జడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదేనని ఆరోపించారు. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబుగారి ప్రభుత్వం… డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.డైవర్షన్ రాజకీయాలతో కప్పిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
డిమాండ్లను సాధించే క్రమంలో యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ర్యాలీలో మంగళవారం పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది భరోసా ఇచ్చారు. పాలకొల్లు వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో వైసిపి పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు భీమవరం కి భారీ ర్యాలీ గా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు, పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మంతెన యోగీంద్ర కుమార్ బాబు పాల్గొని, డీఎస్సీ అక్రమాలపై పోరాడుతున్న విద్యార్థులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు