Skip to main content

Telugu News Power

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సిఫారసు దర్శనం ఇక సులువు.

తిరుమల: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల నుండి భక్తులు సిఫార్సు లేఖలు తీసుకు వెళుతుంటారు. అయితే ఆలయం వద్ద చాలా సమయం వేచి ఉండవలసి వచ్చేది. ఈ జాప్యాన్ని నివారించడానికి, టీటీడీ అధికారులు ఈ విధానాల్లో మార్పులు తెచ్చారు.
ఇప్పుడు సిఫార్సు లేఖలు తీసుకెళ్లే వారికి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద వేరేగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిఫార్సు లెటర్ లు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వీకరిస్తారు. భక్తులు ఈ మార్పులు గమనించి వారి సమయాన్ని అదా చేసుకోవచ్చు.