Skip to main content

Telugu News Power

పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్న విజయ దేవరకొండ దంపతులు.

ఉపకార వేతనాలు అందజేస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక

అచ్చంపేట: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) డబ్బుకు దాసోహం అయిన ఈ లోకంలో, తమ కష్టార్జితాన్ని ఇతరులకు ఇచ్చుటలో ఉన్న హాయిని అనుభవిస్తున్నారు పెళ్లయిన ఓ ప్రేమ జంట. తెలుగు సినీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న విజయ దేవరకొండ, రష్మిక మదన్న నటీనటుల జంట. వివాహం శాశ్వత బంధం కావాలని జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, ఏడు అడుగులు వంటివి ఎన్నో పెళ్ళినాటి ప్రమాణాలు చేయిస్తారు. తమ వివాహం సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేట ప్రజల కోసం ఊరికి ఇచ్చిన మాట అచ్చంగా, పెళ్లినాటి ప్రమాణంలా నిలబెట్టుకున్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 జరగబోతుల విద్యార్థులు 180 మందికి ఆదివారం ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విజయ దేవరకొండ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో విలోమమైపోయిన మానవత్వ విలువలను కాపాడే ప్రయత్నం చేస్తున్న, విజయ్ దేవరకొండ, రష్మిక మదన్న జంటను నెటిజెన్లు అభినందిస్తున్నారు.