పోడూరు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి ప్రభుత్వం, మోడీ ప్రధానిగా గత పుష్కర కాల పాలనకు విజయోత్సవ సూచకంగా మండల బిజెపి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు చింతపల్లి రమేష్ శెట్టి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పార్టీ శ్రేణులు మండలంలోని 14 గ్రామాల్లో, 41 కిలోమీటర్ల పరిధిలో జరిగిన ఈ సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల బిజెపి ఇన్చార్జ్, జక్కంపూడి కుమార్ మోదీ పిలుపుమేరకు 200 మొక్కలు అందజేశారు. పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ ర్యాలీలో జయ జయ ధ్వనాలు చేస్తూ సాగింది. మహిళలు ఈ ర్యాలీకి సంతోషంతో మద్దతు తెలిపారు. ఏం శివ ఉపాధ్యక్షులు దాసరి రత్నం రాజు, మేడపాటి ప్రసాద్ రెడ్డి, ఆకుమర్తి పెద్దిరాజు, కనుమూరు గోపాలకృష్ణంరాజు, కుక్కల కేశవరావు, కొండేటి సర్వేశ్వరరావు, దొంగ కుమార్ తదితరులు పాల్గొన్నారు