Skip to main content

Telugu News Power

మహిళల రక్షణ పై అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: జూన్ ,12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వివిధ సందర్భాలలో, వివిధ రూపాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి ఉన్న చట్టాల గురించి స్థానిక సీఐ కోలా రజిని కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో శుక్రవారం కార్యక్రమం జరిగింది. స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులకు, మహిళా సాధికారిత, మహిళలపై దాడులు, సైబర్ నేరాలతో వేధించటం, ఫోక్సో చట్టం అంశాలపై సి ఐ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్(ఇం) కే రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.