Telugu News Power

వైయస్సార్ పార్టీ భారీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్)మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన కార్యక్రమం స్థానిక నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిర్వహించారు.
ప్రజలు కు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రజలు కు ఇచ్చిన హామీలు అమ్ములు జరపక మోసం చేసినందుకు వెన్నుపోటుకు
రెండేళ్లు నిరసన కార్యక్రమం
శుక్రవారం జరిగింది. వైసీపీ ఇంచార్జ్ గుడాల గోపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూలపల్లి అంబేద్కర్ సెంటర్ నుంచి యడ్ల బజారు వరకు వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ, మేక శేషుబాబు, నాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు ఎడ్ల తాతాజీ, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్, జడ్పిటిసి నడపన గోవిందరాజుల నాయుడు, యలమంచిలి వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఎంపీపీ పెద గోపురం చైర్మన్ కోరాడ శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్ బాబు, మద్ద చంద్రకళ, ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో ర్యాలీకి తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన పలు హామీలను ప్రస్తావిస్తూ, వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.