పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా కుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 30న పాలకొల్లులో ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆక్వారైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పత్రికలకు శనివారం వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీడు రేటు నిర్ధారణకు ముందుగా, ప్రాసెసింగ్ రేటు ఫార్ములా అనుసరించి రేటు నిర్ధారించాలని కోరారు. రొయ్యల కౌంట్ 30 నుంచి 100 వరకు ఉన్న గ్రేడులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కనీస మద్దతు ధరలు నిర్ధారించాలని కోరారు. రైతులు రొయ్యల ఉత్పత్తికి చేస్తున్న ఖర్చులను పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆక్వారంగాన్ని రక్షించుకోవడానికి తీసుకునే నిర్ణయాలకు రైతులందరూ పాల్గొని, తమ అభిప్రాయాలు, సూచనలు చేయాలని గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, బోనం వెంకట నరసయ్య, చినబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు, సజ్జ వీర వెంకట సత్యనారాయణ, బుజ్జి ఈ సమావేశంలో పాల్గొన్నరు.
రాష్ట్ర ఆక్వారైతు సదస్సుకు హాజరు కావాలి -రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లులో ఈనెల 30న రైతు సదస్సుకు భారీ ఏర్పాట్లు.
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు