Telugu News Power

శ్రీ క్షీరా రామం లో సప్త ప్రదక్షిణలు.

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక పట్టణంలో వేం చేసివున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాల్లో మాడవీధులలో సుమారు 100 భక్తుల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు పాల్గొన్నారు. తదుపరి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ ఏడు గంటల 30 నిమిషాలకు శ్రీ స్వామివారి పంచహారతుల సేవ నిర్వహించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు.