భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్).పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి హైదరాబాద్ కి చెందిన దొంతికుర్తి శ్రీ రామమూర్తి ఝాన్సీ లక్ష్మి దంపతులు రూ. 1.50 లక్షల విలువైన పది గ్రాముల బంగారం సమర్పించారు, దీనితో పాటుగా అన్న ప్రసాద వితరణ కు రూ.5,116లు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు..దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసారు

అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తున్న భక్త దంపతులు