Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పధకానికి రూ. 3.15 లక్షల విరాళం.

దాతలను సత్కరిస్తున్న ఆలయ అధికారులు

భీమవరం: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్స్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం రూ.3.15 లక్షలు విరాళంగా అందజే సారు. వీరికి విశేష పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అరసవల్లి సుబ్రమణ్యం పాపోలు ఏడుకొండలు అమ్మవారి చిత్రపటం,ప్రసాదం అందచేసారు.