Skip to main content

Telugu News Power

వచ్చే నెల 9న, క్షీరారామంలో మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో వరుణ జ్వాలాభిషేకం.

పాలకొల్లు: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్.కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు,వచ్చేనెల 9న ఉదయం గం 9 గంటలకు 108 కలశములతో లోక కళ్యాణర్థము వరుణ జ్వాలాభిషేకం జరగనుంది. స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. దేవాదా య ధర్మాదాయ శాఖ వారి సూచనలు మేరకు, శ్రీ పార్వతి, క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జ్వాలాభిషేకం పూజలు డాక్టర్ నిమ్మల రామానాయుడు అమృత హస్తాలతో 108 కలశముల పూజ ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఉదయం గం. 6.00 ల నుంచి 16 మంది రుత్వికులతో అభిషేకములు,జ్వాలాభిషేము, మంత్రపుష్పం పూజలు జరుగును. తదుపరి తీర్థ ప్రసాదములు వినియోగ కార్యక్రమం జరుగుతుంది. యావన్మంది భక్తులు ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు మంగళవారం విజ్ఞప్తి చేశారు.