Telugu News Power

నేడు క్షీరారామంలో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు; ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ పార్వతి సమేత క్షీరారామలింగేశ్వర స్వామి వార్ల, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్ల కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఈ భక్తులు స్వామి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Read More

ఇటు తిరుపతి అటు అరసవల్లి మధ్యలో హమ్ సఫర్ రైలు. -ఫలించిన కేంద్ర మంత్రి కృషి.

శ్రీకాకుళం: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం వాసుల వజజ్రోత్సవ కల ఎట్టకేలకు నిజమైంది. పౌర విమానయాణ శాఖ కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అవిరాళ కృషికి ఫలితం దక్కింది. గత 75 ఏళ్లుగా శ్రీకాకుళం వాసులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి నేరుగా రైలు ప్రయాణం కల్పించాలని మొక్కుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, స్థానిక ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ కోరిక తీర్చడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అనేకసార్లు సంబంధిత…

Read More

పెదపాడు పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన హోం మంత్రి అనిత.

పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు,…

Read More

జేజేశ్వరరావు వైద్య ఖర్చులకు యూటీఎఫ్ రూ. 33 వేల సహాయం.

యలమంచిలి: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి (57) పాలకొల్లు , డిఎన్ఆర్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జేజేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.33 వేల రూపాయలు సేకరించి అందించారు. వారు, వారి బంధువులు, శిష్యుల నుంచి సేకరించి, ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణకు ఈ మొత్తం అందజేశారు. మరో రూ.13 వేలు సోమవారం జమ చేయాలని నిర్ణయించారు. జేజేశ్వరరావు భార్య ఖాతాకు రూ.33 వేలు ఆదివారం జమ చేసారు. ఉపాధ్యాయుని, దండు పద్మావతి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన వితరణకు రూ.40 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన దాన ప్రసాద వితరణకు, రాజోలు సమీప మోరి వాస్తవ్యులు బళ్ళ నాగ మణికంఠ రూ.40 వేల విరాళం ఆదివారం సమర్పించుకొన్నారు. ఆలయ అర్చకులు ఈ భక్తులకు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు యండ సత్యవతి ప్రసాద్…

Read More

అమరావతికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు.

అమరావతి: ఏప్రిల్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ పీ ఆర్) తయారీ కి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నగరానికి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రవేశించడానికి 19 చోట్ల ఇంటర్ చేంజ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రహదారి పొడవు 190 కి.మీ. వరకు ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో ఈ పరిధిలోకి వస్తాయి….

Read More

దాతృత్వానికి మంచి మనసు ఉండాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పోడూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) డబ్బు చాలామంది వద్ద ఉంటుందని, అయితే దాతృత్వానికి మంచి మనసు ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల 142 మంది 9వ తరగతి విద్యార్థులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జిన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్, కాంటినెంటల్ కాఫీ, చెట్టినాడ్ సిమెంట్…

Read More

బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తా -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం అడబాల థియేటర్ సెంటర్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మహిళాభ్యున్నతి కోసం, ఆనాడే బాలికల విద్యకు పాఠశాల ఏర్పాటు చేసిన తొలి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప దార్శనికుడిని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం…

Read More

చిత్ర పరిశ్రమ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధం. -సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి.

పాలకొల్లు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ లో ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తరగతులను, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సినీ పరిశ్రమ స్థాపించాలనుకున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా…

Read More

తేజస్వికి మురళీమోహన్ పురస్కారం.

గుంటూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ సినీ నటులు, మాజీ ఎంపీ, పద్మశ్రీ, మాగంటి మురళీమోహన్ తన పేరుపై ఏర్పాటు చేసిన అవార్డును, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వినికి శనివారం, స్థానిక బృందావన్ గార్డెన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, తేజస్వి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు….

Read More