Skip to main content

Telugu News Power

చవాకుల ట్రస్ట్ కు దాసరి సేవా రత్న అవార్డు.

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చవాకుల చారిటబుల్ ట్రస్ట్, దాసరి లెజెండరీ అవార్డు అందుకుంది. దాసరి లెజెండరీ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ సినీ ల్యాబ్స్ లో అత్యంత వై భవం శుక్రవారం జరిగింది. చవాకుల ట్రస్ట్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు చవాకుల సూర్య నరేష్ సేవలు గుర్తించి, దాసరి సేవారత్న అవార్డును ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ…

Read More

పెన్షన్ రోజే పెద్ద పండుగ -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెన్షన్ రోజే, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ మూడు పండగలు కలిసిన పెద్ద పండుగని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధాప్య పెన్షన్ రూ. 2 ల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. గత జగన్…

Read More

సమాజ అభివృద్ధికి శ్రామికులే సారధులు. -రిక్షా రాముడు గా మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజ అభివృద్ధికి శ్రామికులే సారుధులని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శుక్రవారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మేడే అన్ని పండగల కంటే పెద్ద పండగన్నారు. ఈ ప్రపంచంలో నిస్వార్ధంగా పని చేసే శ్రామిక లోకం శ్రమ, సేవలు మనం పొందే ప్రతి వస్తువు…

Read More

యలమంచిలి ఎస్సై గురవయ్య సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అధికారులు.

భీమవరం: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి ఎస్సై కే.గురవయ్య విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే వారం రోజులు అయింది. ఇంతవరకు ఆ విషయం బయటకు పొక్కకుండా అధికారులు గుట్టుగా ఉంచారు. ఇందుకు బలమైన కారణం ఏదో ఉందని ప్రజలు, పార్టీల వారు చర్చించుకుంటున్నారు. స్థానిక బూరుగుపల్లి గ్రామంలో ఈ నెల 16న నూకాలమ్మ జాతరలో జరిగిన భయానక ఘర్షణ దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడ్ని…

Read More

గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి సంబంధించి కనీస అవసరాలైన రక్షిత మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్తు సరఫరా చేయటానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని విఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మి అధ్యక్షతన, మండల అభివృద్ధి అధికారి ఎన్ ఎస్ ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్…

Read More

పదో తరగతి ఫలితాల్లో ఎలమంచిలి మండల ప్రగతి.

యలమంచిలి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల ఉన్నత పాఠశాలల పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మండలంలోని పాఠశాలల వారీగా అత్యధిక మార్కులు,10వ తరగతి ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి: వైవి లంక పాఠశాల 96% పాసు శాతంతో మొదటి స్థానంలో నిలిచింది, కొంతేరు 67%తో చివరి స్థానాని చేరింది. మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఈ ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More

పదో తరగతి ఫలితాల్లో జేయశ్రీ జయకేతనం.

యలమంచిలి: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) మట్లపాలెం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న అంబటి జయశ్రీ యుటిఎఫ్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించింది. ఆనాడే ఆమె ప్రతిభ కనబరిచింది. ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను592 మార్కులు సాధించింది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంది. తెలుగులో 99, ఆంగ్లంలో 98, హిందీలో 95 మార్కులు వచ్చాయి….

Read More

భూ సేకరణలో రూ. 1,140 కోట్ల భారీ స్కాం. ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్.

అమరావతి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశించాలని విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు సమర్పించింది. గత ప్రభుత్వాలలో జగనన్న కాలనీలు నిర్మించడానికి భూసేకరణ జరిగింది. భూ సేకరణ ధర అర్జెంటు రేటు కంటే ఎక్కువ చెల్లించడం, ఊరికి దూరంగా, కొన్నిచోట్ల అసలు అవసరం లేకుండా భూసేకరణ జరిగినట్టు గుర్తించారు….

Read More