Skip to main content

Telugu News Power

అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ తరలింపు

పాలకొల్లు: నవంబర్ ,28 (తెలుగు న్యూస్ పవర్) ఇటీవల పూలపల్లి బైపాస్ రోడ్ లో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని వేరేచోటకు మార్చారు. ఇక్కడ భవనం విశాలంగా లేకపోవడం వల్ల, ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రదేశాన్ని మార్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కు చెందిన, పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో గల విశాల భవనంలోకి శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి, నూతన భవనంలోకి గృహప్రవేశం చేశారు. ఈ ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ నూతన భవన ప్రారంభ కార్యక్రమాల్లో
కార్యక్రమంలో గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ,కార్యదర్శి డాక్టర్ వర్మ, కోశాధికారి, కె.గణపతిరాజు, గుడాల హరిబాబు,సినీ హాస్యనటులు సారిక రామచంద్ర రావు, చవాకుల ట్రస్ట్ అధినేత, డాక్టర్ చవాకుల సూర్య నరేష్, బందెల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.