Skip to main content

Telugu News Power

శివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారుల సమీక్ష.

శివరాత్రి ఏర్పాట్లు పరిశీలిస్తున్న దేవాదాయశాఖ అధికారులు

పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, ఈనెల 15 ఆదివారం నుంచి జరగనున్న శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు సమీక్ష జరిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇంతవరకు చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులకు ఈ ఓ ముచ్చర్ల శ్రీనివాసరావు వివరించారు. దేవాదాయ శాఖ, డిప్యూటీ కమిషనర్, రమేష్ బాబు, , అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్, వి వెంకటేశ్వరరావు,ఆలయంలో జరగనున్న ఏర్పాట్లు పరిశీలించారు. మహాదేవుని దర్శనానికి, భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు.