Skip to main content

Telugu News Power

దర్శకుడు బుచ్చి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన,”పెద్ది”.

హైదరాబాద్: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మెగా గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న, పెద్ది చిత్ర దర్శకులు సాన బుచ్చిబాబుకు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర కథ చెప్పే విషయంలో దర్శకులకు ఉన్న అభిరుచి, వివరంగా, లోతుగా చెప్పే విధానం స్ఫూర్తివంతంగా ఉందని రామ్ చరణ్ వెల్లడించారు. భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి అద్భుత చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా, తాను ఎన్నో విషయాలు రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నానని, ఈ చిత్రం వెయిటింగ్ రూమ్ లో చూసినప్పుడల్లా ఎంతో హృద్యంగా, హృదయాన్ని తాకేలా కనిపిస్తున్నదన్నారు.తనకు అవకాశం ఇచ్చినందుకు బుచ్చిబాబు కృతజ్ఞతలు తెలిపారు.