యలమంచిలి: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా, అమ్మవారిని ఆదివారం మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామోత్సవం జరిపి పుట్టింటికి చేర్చారు. శ్రీశ్రీశ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శింపజేశారు. గతంలో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించిన తాళ్లూరి సత్య శ్రీనివాస్, అమ్మవారి ఆలయం వద్ద మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి అనుగ్రహ పాత్రులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, బొప్పన రాంబాబు, సిద్ధాని రాము, శివ, ఆకుల యేసు, తాళ్లూరి చందు, బొప్పన సురేష్, పలువురు భక్తులు గ్రామ యాత్రలో పాల్గొన్నారు.
శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారు పుట్టింటికి చేరిక, గ్రామోత్సవం.
అమ్మవారిని పుట్టింటి (నడి వీధి) కి ఊరేగింపుగా తీసుకు వెళ్తున్న దృశ్యం