Skip to main content

Telugu News Power

కళ్యాణరాముని విగ్రహాలు,పాదుకలు, ధనుస్సు దర్శించుకున్న భక్తులు.

గౌరు నాయుడు ఇంటి వద్ద అయోధ్య బాల రాముని ఆలయానికి తరలి వెళ్తున్న బంగారు బాతుకులు ధనస్సు
రాములవారి బంగారు ధనస్సు

పాలకొల్లు: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బ్రాడీపేట, బైపాస్ రోడ్ లో గల కర్నేని గౌరు నాయుడు, రోజా రమణి దంపతుల గృహము వద్ద, అయోధ్యకు వెళుతున్న రాములవారి కనకపు పాదుకలు, ఉత్సవ విగ్రహాలు, ధనస్సు, విల్లు భక్తులు దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు. అయోధ్యలో నిర్మించనున్న కళ్యాణ రాముని ఆలయ నిర్మాణం సందర్భంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారు. ఈ రామాలయం సుమారు 300 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్నారు. కర్ణేని దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి, పాదుకులను శిరస్సుపై ధరించారు. పలువురు భక్తులు దర్శనం చేసుకోవడానికి తరలివచ్చారు.