అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)
చిక్కాల రామచంద్రరావు, ఆ పేరే చాలు, నీతి నిజాయితీలకు నిలువెత్తురూపం, అజాతశత్రువు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సరళమైన జీవన విధానం, రాజనీతిజ్ఞుడు, ప్రజా సేవకుడు ఇంకెన్ని ఉపమానాలైనా ఆయన గురించి చెప్పుకోవచ్చు. చిక్కాల రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాళ్లరేవు నియోజకవర్గానికి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. వీరి రాజకీయ జీవితం తొలిసారి 1983లో తాళ్లరేవు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా విజయంసాధించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. గత 42 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ దురంధరులు చిక్కాల కు ఎమ్మెల్సీ పదవి , తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న నమ్మకానికి, విధేయతకు కానుకగా ఇచ్చారు. ఈరోజు వరకు ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణల మకిలి అంట లేదు. ముఖ్యంగా రైతులు సమస్యలు కోసం నిత్యం పోరాడే రైతు బాంధవునిగా వారి సేవలు రైతులు ఎప్పటికీ మర్చిపోలేరు. రాజకీయ రంగంలో ఓ అరుదైన వ్యక్తిత్వం గల గొప్ప నాయకుడు చిక్కాల రామచంద్రరావు అంటే అతిశయోక్తి ఆవగింజంత కూడా లేదు. వారి జననోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, మాజీ హోం నిమ్మకాయల మంత్రి చినరాజప్ప, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పలువురు రాజకీయ నాయకులు, సహచరులు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిక్కాల వంటి వారు మార్పు కోరుకునే నేటితరం నిజాయితీపరులైన యువ రాజకీయ నాయకులకు ఓ స్ఫూర్తి, ఆదర్శం.

నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చిక్కాల.

నాటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ తో చిక్కాల

నాటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ తో చిక్కాల

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చిక్కాల