Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ నిత్యాన్నదాన వితరణకు షెడ్డు ఏర్పాటు. -ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభం

నిత్యాన్నదాన పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణకు నిర్మించిన షెడ్డు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ వేసవి పరిస్థితుల దృష్ట్యా, భక్తుల సంక్షేమ, సౌకర్యాల కొరకు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన, మహాపుణ్యాత్ములు యేరుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అన్నప్రసాద వితరణ కొరకు తాత్కాలిత షెడ్డు ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉడిసి మీనాక్షి,అతికాల ఆంజనేయ ప్రసాద్, గుడిసె నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి,అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం,మిర్తిపాటి గుణేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పోపోలు ఏడుకొండలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దర్శనార్ధం వచ్చే భక్తులకు, అన్న ప్రసాద వితరణ కు దేవస్థానం సమీపంలో అద్దె కు తీసుకొన్న స్థలం, షెడ్ లో టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేసి.అరిటాకు లో భోజనాలు పెట్టడానికి తగు ఏర్పాట్లు చేయడానికి అవసరం అయిన.అన్ని చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ కు,చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలికిసూచించారు. గతంలో దేవస్థానానికి చెందిన ఇరుకు గదిలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడానికి దేవస్థానం వారు, భక్తులు ఇబ్బందులు పడేవారు. నేటి నుంచి విశాలమైన షెడ్డులో మహాప్రసాద వడ్డన కార్యక్రమం చేపట్టడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.