
భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా, చండీహోమం జరిగింది.దేవస్థానo అర్చకులు, వేదపారాయణలు ఘనంగా హోమం నిర్వహించారు. ఈ హోమం పూజలో 60 మంది పైగా దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, వుదిసి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.