పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కాం) మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం ప్రముఖ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కంటతడి పెట్టడం దేశానికి మంచిది కాదని, మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయన్న భారతీయ సంస్కృతిని విస్మరించి, ఇండియా కూటమి బిల్లుకు అడ్డుపడటం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీఆర్ కాలంలో మహిళలకు ఆస్తి హక్కులు సగభాగం కల్పించిందని, నేడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మహిళల పట్ల ప్రత్యేకమైన గౌరవంతో ఎన్నో పథకాలు ప్రారంభించారన్నారు. డ్వాక్రా మహిళలు, దీపం పథకం, తల్లికి వందనం, ఉచిత బస్సు సౌకర్యం వంటి ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నారు. మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా సమున్నత స్థానానికి తీసుకురావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు, ఇతర బిల్లులను సాకుగా చూపటం ప్రతిపక్షాల కుటిల నీతికి నిదర్శనం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాదికి సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా, 50 శాతం సీట్లు పెంచుతామని హామీ ఇచ్చినా, తమ రాజకీయ అవసరాల కోసం ప్రతిభందకం సృష్టించడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఇండియా కూటమి దేశాన్ని ఉత్తర,దక్షిణ భారతదేశాలుగా విడగొట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏపీఐఐడీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ, మహిళలు చట్టసభలో అడుగుపెడితే తమ ఉనికి కోల్పోతామనే భయంతో మహిళా బిల్లును అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, కర్నేని గౌర్ నాయుడు, చిట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పెనుమత్స రాంభద్ర రాజు, చైర్మన్ మీసాల రాము, తెలుగు రైతు చెరుకూరి అంజిబాబు,నర్సాపురం టిడిపి ఇన్చార్జ్ పొత్తూరు రామాంజనేయ రాజు, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజని కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, అయ్యప్ప నాయుడు, ఇంటి శ్రీరాముడు, బోనం నాని, కడలి గోపి, పీతల శ్రీనివాస్, రాంబాబు, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులు గా మిగిలిపోతారు. -మంత్రి నిమ్మల రామానాయుడు
మహిళా బిల్లుపై పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే రాధాకృష్ణ, రాంబాబు