Telugu News Power

భద్రాచలంలో దర్శనాల రద్దు.

ప్రస్తుతం ఉన్న భద్రాద్రిరామాలయం
భద్రాచలం ఆలయ బృహత్ ప్రణాళిక రూపు రేఖలు.

భద్రాచలం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) కళావాహన కార్యక్రమం సందర్భంగా, తెలంగాణలోని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ నెల 26 ఆదివారం మధ్యాహ్నం గం.1.00 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనములు రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి,
కే. దామోదర్ రావు బుధవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాచలం సీతారామ స్వామి వారి అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కళావాహన కార్యక్రమంలో, ఆలయ ప్రాంగణంలో ఉన్న, ఉపాలయాల దేవత మూర్తులను రంగనాయకుల గుట్టపై ఉన్న శ్రీరామదాసు ధ్యానమందిరం వద్ద గల బాలఆలయం, ఆండాళు అమ్మవారు, లక్ష్మీ తాయారు అమ్మవారు, దేవాలయం ప్రధాన ముఖమండపం వద్ద ఏర్పాటు చేయుటకు గాను దర్శనాలు నిలిపివేస్తున్నట్టు వివరించారు. మధ్యాహ్నం నుంచి యధావిధిగా దర్శనాలు అవుతాయని, భక్తులు ఈ విషయాన్ని గమనించి, సెలవు రోజుల్లో వారి ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ పనులతో
భద్రాచలం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం
అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.586 కోట్ల వ్యయంతో మూడు దశల్లో ఆలయం, పట్టణ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
మొదటి దశకు రూ.351 కోట్లు
ఈ మార్చి 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి దశ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ దశలో ముఖ్యంగా భక్తులకు సౌకర్యాలు పెంపు, ఆలయ విస్తరణ, గోదావరి ఘాట్ అభివృద్ధిపై దృష్టి సారించారు.
మొదటి దశలో ముఖ్య పనులు
ఆలయ సముదాయం అభివృద్ధికి రూ.180 కోట్లు
(మండపాలు, రాజగోపురం, చిత్రకూట మండపం, అన్నప్రసాద భవనం, క్యూ లైన్లు)
గోదావరి ఘాట్ అభివృద్ధికి రూ.75 కోట్లు
పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.96 కోట్లు
తదుపరి దశలు
రెండో దశ,రూ.108 కోట్లు (భూమి స్వాధీనం)
మూడో దశరూ.127 కోట్లు,(పట్టణ అభివృద్ధి)
ఈ మొత్తం ప్రాజెక్ట్‌ను 2028–2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక క్యూ లైన్ వ్యవస్థ,టికెట్ కౌంటర్ల విస్తరణ,గోదావరి తీరం సుందరీకరణ,
కొత్త మండపాలు, సేవా సదుపాయాలు
వంటి అనేక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా భద్రాచలం
ఈ అభివృద్ధి పనులతో భద్రాచలం ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా ఎదగనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు త్వరితగతిన జరగటానికి పనులు ప్రారంభమయ్యాయి.