Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో పుస్తక దినోత్సవం.

పాలకొల్లు: ఏప్రిల్,23(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవ జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, మాట్లాడుతూ పుస్తకాలు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని, పఠనా శక్తిని పెంచుకోవాలని విద్యార్థులకు వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్, గ్రంథాలయ ఇన్చార్జ్ టి కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. ఐ.క్యు.ఏ.సీ కోఆర్డినేటర్ కె. భద్రాచలం మాట్లాడుతూ, విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో పాటు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని. సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వి.వి.సి.హెచ్ రమేష్, ఫిజికల్ డైరెక్టర్ పి. దుర్గారావు, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

పుస్తక దినోత్సవం మాట్లాడుతున్న ప్రిన్సిపల్