Skip to main content

Telugu News Power

శ్రీ శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే

భీమవరం: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ,కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందచేసారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

మావుళ్ళమ్మ వారి చిత్రపటం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే యాదవ్