Telugu News Power

తాగునీటి సరఫరాలో సమస్యలు రాకూడదు. -ఆర్డీవో దాసిరాజు

పాలకొల్లు: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్యలు రాకుండా, కార్యాచరణతో ముందుకు రావాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం, సాయంత్రం నియోజకవర్గస్థాయి అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్టు ఆర్డిఓ తెలిపారు. శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా నిధులు అందజేయడానికి సిద్ధంగా ఉందన్నారు. మంచినీరు కాలుష్యం కాకుండా, వైద్యశాఖ అధికారులతో కలిసి రక్షిత జలాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. కలుషిత నీరు తాగటం వల్ల వేసవిలో డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ వారి ద్వారా పురస్కారాలు అందుకున్న, స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి
ఎన్ ఎన్ ఉమామహేశ్వరరావు, గోరింటాడా కార్యదర్శి గాయత్రి, గ్రామీణ నీటి సరఫరా ఏ. ఈ. వి.వి రమణ లను నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో ఆర్డీవో ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఉమామహేశ్వరరావు, జెడివి ప్రసాద్, తహసిల్దార్లు యడ్ల దుర్గా కిషోర్, గ్రంధి పవన్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్, డి ఇ రవిరాజు,
ఏ.ఈ. వివి రమణ, డిప్యూటీ ఎంపీడీవో మూర్తి బాబు, ఎంఈఓ గుమ్మళ్ళ వీరస్వామి, నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో, అధికారులు