Telugu News Power

బూరుగుపల్లి హత్య కేసులో మరి కొందరు అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లిలో ఈనెల 16న జరిగిన నూకాలమ్మ జాతరలో బీభత్సం సృష్టించి ఒకరి మృతికి కారణమైన కేసులో శనివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుత్తుల శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రౌతుల రఘుబాబు, గంగులకుర్తి రామసూర్య సత్య సుబ్రహ్మణ్యం، పాముల ఉదయ్ కిరణ్, కొడాలి సతీష్, ఎర్రవారపు నాగరాజులను, నరసాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఏలూరు జిల్లా జైలుకు తరలించినట్టు సిఐ గుత్తుల శ్రీనివాస్ వెల్లడించారు.