Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో అధ్యాపకులకు శిక్షణా శిబిరం ప్రారంభం.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక బి ఆర్ ఆర్., జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, కళాశాల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి, రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ సాంబశివరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా అధ్యాపకులు కూడా ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధ్యాపకులు, విద్యార్థుల స్థాయికి బోధన చేస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి,
ఉపాధి అవకాశాలను కల్పించుటకు దోహదపడాలన్నారు. నేటి తరంలో అధ్యాపకులు తరగతులకు పరిమితం కాకుండా, విద్యార్థి నైపుణ్యాలను గుర్తించి సామాజిక ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుంటూ వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల పట్ల అధ్యాపకులు భావోద్రేకాలను అదుపులో ఉంచుకుంటూ, స్థితప్రజ్ఞతతో వారి మనసు కు హత్తుకునేలా బోధన చేయవలన్నారు. కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు నేటి విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులను అత్యుత్తమముగా తీర్చిదిద్దే శక్తి, అధ్యాపకుడన్నారు. వారికి ఇటువంటి శిక్షణ ద్వారా తగిన మెళకువలు నేర్చుకుని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్నారు.
కళాశాల సెక్రటరీ కేవీ సీతారామరాజు మాట్లాడుతూ, అధ్యాపకులు విద్యార్థులకు
దిశానిర్దేశం చేస్తారన్నారు, అధ్యాపక వృత్తి నిత్య విద్యార్థి లాంటిదని, అధ్యాపకుడు శక్తివంతంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతారన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నిష్ణాతులైన ప్రొఫెసర్స్ తమ కళాశాల అధ్యాపకులకు ఇటువంటి వర్క్ షాపు నిర్వహించడం ద్వారా అధ్యాపకులలో నైపుణ్యం, సాంకేతికత, ప్రేరణ జరిగి తద్వారా తమ కళాశాల అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి అకాడమిక్ అడ్వానైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి , ఎన్ సీతారామారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జి అధ్యాపకులు ఎన్ రవికుమార్ రాధా మాధవి, వై శివప్రసాద్ వర్మ, సిరి చందన, విజయలక్ష్మి, ప్రసన్నకుమారి, ప్రసన్న నాగదేవి జానకిరామయ్య, మహంకాళి రావు, యదిద్య, రామలింగారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.