పాలకొల్లు: జూన్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్ )
పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు అనగా ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 300 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి ( కిష్టప్ప ) పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివార్లకు ధూప సేవ, శ్రీ స్వామి వారి పంచ హారతులు సేవ ఆలయం కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
క్షీరా రామం మాడవీధులలో భక్తుల ప్రదక్షిణలు.
సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు