Skip to main content

Telugu News Power

రేపే ఎమ్మెల్సీ అభ్యర్థి బి. గోపి మూర్తి పరిచయ సభ.

భీమవరం:జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుత ఉపాధ్యాయ, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొ ర్రా గోపి మూర్తి, రెండవసారి పోటీకి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు భీమవరం,బ్యాంకు కాలనీ,శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అభ్యర్థి పరిచయ సభ ఏర్పాటు చేసినట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు. యూటీఎఫ్ నాయకులు, నాటి ఎమ్మెల్సీ షేక్ షాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంగా, జరిగిన ఉప ఎన్నికల్లో గోపి మూర్తి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వీరి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుండటంతో, మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు.
ఎమ్మెల్సీ బి గోపి మూర్తి ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజాసంఘాల మద్దతుతో పిడిఎఫ్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గోపి మూర్తి అభ్యర్థిత్వం,ఎమ్మెల్సీగా సాధించిన విజయాల గురించి పరిచయం చేయటానికి ఈ సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.