Telugu News Power

వాస్తవ ఓటర్లను గుర్తించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ.

ఓటర్ల సవరణ కారేశాలలో మాట్లాడుతున్న ఎంపీ పాక

పాలకొల్లు: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో వాస్తవ ఓటర్లను గుర్తించాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎస్ ఐ ఆర్ పై బిజెపి శ్రేణులకు ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల సవరణ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు ప్రాణం వంటిదని అన్నారు. ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొంటున్న బూతులు అధికారులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని, అప్రమత్తతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా జరగాలన్నారు. ఓటరుకు తెలియకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడానికి ఎవరికి అధికారం లేదని గుర్తించాలన్నారు. ఓటు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి ఓటు వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. అక్రమ ఓటర్ల తొలగింపులో కార్యకర్తలు తగిన ప్రణాళికతో పనిచేయాలని కోరారు. దేశంలో ఉన్న కోట్ల మంది అక్రమ చొరబాటుదారుల వల్ల, దేశ ప్రగతికి విఘాతం కలుగుతుందన్నారు. సమ సమాజ స్థాపనకు వాస్తవ ఓటర్లను గుర్తించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, రావూరి సుధా, జక్కంపూడి కుమార్, కుక్కల కేశవరావు, చింతలపాటి రమేష్ రాజు, కొల్లి కొండ ప్రసాద్, తోట గంగరాజు, ఎర్రంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు.