Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.

కళాశాలలో మొక్కలు నాటుతున్న దృశ్యం

పాలకొల్లు: జూలై,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ I, II యూనిట్లు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది..

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని సూచించారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలంటే మొక్కల పెంపకం, అటవీ సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బూసి వెంకటస్వామి, ఎకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత,ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎమ్ రామకృష్ణ, డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, ఎకోక్లబ్ కన్వీనర్ పి శ్రీనివాసరావు, అధ్యాపకులు వి శిరీష, డి హెప్సి రాణి మరియు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.