Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణ నిధికి రూ. 2 లక్షల విరాళం.

ఎమ్మెల్యే అంజిబాబు ద్వారా విరాళం అందజేసిన గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర నిధికి చినఅమిరానికి కి చెందిన, గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళాన్ని స్థానిక శాసన సభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,గుసిడి నాగ శిరీష,పాపోలు ఏడుకొండలు, స్వర్ణ వస్త్ర కమిటీ ప్రాజెక్ట్ సభ్యులు గొంట్ల నారాయణ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారు.