పాలకొల్లు: ఆగస్టు,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో పేద మధ్యతరగతి వారి ఆరోగ్య రక్షణ కోసం, వివిధ చికిత్సలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండేళ్ల కాలంలో రూ 15.90 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 51.74 లక్షల చెక్కులు 61 మంది లబ్ధిదారులకు అందజేశారు. కోటకు ప్రభుత్వం ద్వారా ప్రజలకు వైద్య సహాయం అందించటానికి అవసరమైన పనులన్నీ తమ కార్యాలయం ద్వారా పూర్తిచేసి లబ్దిదారులకు చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టిడిపి పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసీరావ్, రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, బిట్టా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కూటమి రెండేళ్ల పాలనలో రూ. 15.90 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. -మంత్రి నిమ్మల.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి నిమ్మల