Skip to main content

Telugu News Power

బిజెపి పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

సమావేశంలో మాట్లాడుతున్న, శ్రీదేవి

పాలకొల్లు: అక్టోబర్,3( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం శ్రీదేవి మాట్లాడారు. ఎన్నికల లో బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్ట పరచాలని కోరారు. జిల్లా ఇన్చార్జి, రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ, బూత్ కన్వీనర్ల కృషి ఎంతో అవసరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం కల్పించాలని కోరారు. సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమాలు పట్టణంలో నిర్వహించాలని సూచించారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్ అధ్యక్షత వహించారు, రాష్ట్ర మీడియా ప్రతినిధి, ఉన్నమట్ల కపర్తి, ఎర్రం శెట్టి పద్మారావు, గవర పవన్ నాయుడు, జైన్, పులకండం శ్యామల, చేగొండి బాబి, బేతి రెడ్డి మల్లికార్జున రెడ్డి, మల్లవోలు సురేష్, బోడ సత్యజిత్, ముద్దాల పవన్, చందా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.