Skip to main content

Telugu News Power

Blog

కళాశాలలో క్రిస్మస్ వేడుకలు

పాలకొల్లు:డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ,శాంతి,క్షమాగుణాల సమాహారం అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు సేవాభావం, క్షమాగుణం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కోసి, క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. విద్యార్థులు క్రిస్మస్ కోరల్స్ ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో టి కృష్ణ, కే భద్రాచలం, వి యామిని, ఎం రామకృష్ణ,…

Read More

వినియోగదారుల వారోత్సవాలు ముగింపు.

పాలకొల్లు: డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్). స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల ముగింపు ఉత్సవాలు మంగళవారం జరిగాయి. ఈ వారోత్సవాలు ఈనెల 17న ప్రారంభమై 23 తో ముగిసాయి. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులు బాధ్యతలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులను ముంచెత్తుతున్న, కన్జ్యూమెరిజం నుంచి కొంతవరకు బయటపడవచ్చునన్నారు. విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ విభాగాలు విజేతలైన విద్యార్థులకు బహుమతులు…

Read More

డిగ్రీ విద్యార్థుల పారిశ్రామిక యాత్ర

పాలకొల్లు: డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు మంగళవారం పారిశ్రామిక యాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు నర్సాపురం లో ఉన్న అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న హస్తకళల ఎక్స్పోకు సంబంధించి, తమ పర్యటన ద్వారా పరిశీలించి, పలు విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ యాత్రలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లేస్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ కలవకొలను తులసి రావు ఈ లేస్ పార్క్ అంతర్జాతీయ ఖ్యాతి…

Read More

తెలుగుదేశం,వైసిపి పార్టీల మధ్య మాటల యుద్ధం.

పాలకొల్లు:డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గంలో బలమైన రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాలరావు,గోపి చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం రాజుకుంది. వెంటనే తెలుగుదేశం నాయకులు ప్రతిదాడికి దిగారు. సూపర్ సిక్స్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని టిడిపి నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ, పోలీస్ నియామకాలు జరిపామన్నారు. అభివృద్ధి పనులు…

Read More

శివ సహస్రనామ పూజ

స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

Read More

క్షీరారామ ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం

పాలకొల్లు:డిసెంబర్23 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రం, స్థానిక శివాలయం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానిక అభిషేక మండపంలో అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నూతన కమిటీ ప్రధానంగా ఆలయ అభివృద్ధి గురించి విస్తృతంగా,ఈ సమావేశంలో చర్చించారు. ఆలయ అర్చకులు, అభిషేక పండితులు యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, క్రిస్టప్ప,అభిషేక పండిట్ సూరిబాబు, పర్యవేక్షకులు…

Read More

అంతర్జాతీయ కార్యదర్శిగా ‘ దర్శి’

పాలకొల్లు: డిసెంబర్, 22 (తెలుగు న్యూస్ పవర్) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నూతన కార్యదర్శిగా పాలకొల్లు వ్యాపారవేత్త దరిశి శ్రీనివాస గుప్త నియమితులయ్యారు. హైదరాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో ఆదివారం ఈ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గుప్త అదే రో జు జరిగిన, ప్రమాణస్వీకారోత్సవంలో బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఏడాది నుంచి వీరి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1500 వాసవి క్లబ్ లు ఉన్నాయి. ఈ క్లబ్బుల్లో 80 వేల వరకు సభ్యులు…

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది. స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) శాస్త్ర,సాంకేతిక రంగాలతో పాటు,మనిషి జీవితం ప్రతినిత్యం గణితంతో ముడిపడి ఉందని గణిత శాఖ హెచ్ ఓ డి డాక్టర్ జి సాయి బాబా పేర్కొన్నారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో సోమవారం గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. తరువాత గణిత సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు మాట్లాడుతూ,…

Read More