మంత్రి నిమ్మలకు మానవత లో సభ్యత్వం.
పాలకొల్లు: సెప్టెంబర్, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రస్తుత ఏడాదికి మానవత సంస్థలో తన సభ్యత్వాన్ని పునరుద్దరించుకొన్నారు. ‘మానవత’ సేవాకార్యక్రమాల పట్ల తన అభిమానాన్ని వ్యక్తంచేసారు. పాలకొల్లులో మానవత శాఖ ప్రారంభించిన నాటినుంచీ రామానాయుడు సభ్యునిగా కొనసాగుతున్నారు. మానవత చేసే పలుకార్యక్రమాలలో స్వయంగా పాల్గొని, సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు. ఈ సంవత్సరం పాలకొల్లు మండల శాఖ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కు బదులుగా గుడ్డ సంచులను…