Skip to main content

Telugu News Power

ఈనెల 22న ఆక్వా రైతుల ఉద్యమ శంఖారావం.

పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. స్థానిక పూలపల్లి కళ్యాణ మండపంలో గురువారం, సంఘ సమావేశం గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈనెల 22న ఉభయగోదావరులు, కృష్ణాజిల్లా ఆక్వా రైతులతో భారీ సభ జరపనున్నట్లు వెల్లడించారు. కొన్నిసార్లు తమ సమస్యలు తీసుకువచ్చినప్పటికీ, పరిష్కారం కాలేదు అన్నారు. యుద్ధం ముసుగులో కేజీకి 50 రూపాయల ధర తగ్గించడం, మేత ధర కేజీకి నాలుగు రూపాయలు…

Read More

ఆక్వా రైతుల నష్ట నివారణకు 21 వరకు గడువు. -జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయం.

పాలకొల్లు: మార్చి ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షత వహించారు. దాణ ధరలు తగ్గింపు, రొయ్యల కొనుగోలుపై ధరల పెంపు విషయంలో ఈనెల 21 లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాణా ధరలు కేజీకి నాలుగు రూపాయలు పెంపుతో రైతులను ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధం బూచి చూపి…

Read More

వరి పరిశోధన శాస్త్రవేత్తలతో కలెక్టర్ సమావేశం.

భీమవరం: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలతో, రైతు సాధికార ప్రతినిధులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, పకృతి వ్యవసాయ పద్ధతుల గురించి చర్చించారు. తక్కువ ఖర్చుతో వరి ఉత్పాదకత పెంచి, సాగు వల్ల రైతులు లాభపడే సమగ్ర వివరాలు శాస్త్రవేత్తలు అందించారు. ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు పురోగతి విస్తరణ అవకాశాల గురించి చర్చించారు. కలెక్టర్ కు డి ఆర్…

Read More

రైతులు వెంటనే ఈ-పంట నమోదు చేసుకోవాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి, 20(తెలుగు న్యూస్ పవర్) రైతులు వెంటనే ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని, స్థానిక వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ శుక్రవారంవిజ్ఞప్తి చేశారు. ఈనెల 25 ఈ-క్రాప్ నమోదుకు గడువు ముస్తుందని వెల్లడించారు. పాలకొల్లు మండలంలో 9,900, పోడూరు మండలంలో14,500, ఆచంట మండలం10, 250 ఎకరాల్లో దాళ్వాపంట సాగుతున్నట్టు నమోదయింది. ఇప్పటికీ కూడా కొంతమంది విదేశాల్లో ఉన్నవారు, రాస్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఓటిపి ద్వారా కూడా ఈ-నమోదు చేయించుకోవచ్చు అని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్(ఏపీ ఎఫ్ ఆర్)…

Read More

రాష్ట్రానికి మంత్రి అయినా, పొలానికి రైతునే-మంత్రి నిమ్మల ఉవాచ

పాలకొల్లు, డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రానికి సామంత రాజు అయిన, పొలానికి రైతునేనని నిరూపించారు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు. విశ్రాంతి అంటే, పని నుంచి పనికి అనే పెద్దల మాట, మంత్రి విషయంలో చక్కగా సరిపోతుంది. రాష్ట్రస్థాయిలో పనిమంతుడు పదానికి చిరునామాగా నిలిచారు నిమ్మల. బుడమేరు వరదల సమయంలో వీరి పనితనాన్ని రాష్ట్రం మొత్తం గుర్తించి అభినందించింది. రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖమాత్యులుగా క్షణం తీరిక లేకుండా ఉన్న,…

Read More

నారుమడులు త్వరగా వేయాలి

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ పాలకొల్లు,డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రైతులు దాళ్వా వరి నారుమళ్ళు వెంటనే వేయాలని వ్యవసాయ సహాయ సంచారకులు మురళీకృష్ణ రైతులకు సూచించారు. పాలకొల్లు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ 90 శాతం నారు మళ్ళు ఇంకా వేయవలసి ఉందన్నారు. ఈ సబ్ డివిజన్లో గల పాలకొల్లు మండలం లో 4198 హెక్టార్లు , పోడూరు మండలంలో 5708 హెక్టార్లు, ఆచంట మండలంలో 4259 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయా…

Read More

రైతుకు తీరని కష్టం,సార్వ పంట నష్టం.

యమంచిలి:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల సార్వపంట దారుణంగా దెబ్బతింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. క్రాప్ కటింగ్ శాంపుల్స్ లో ఎకరానికి 14 నుంచి 22 బస్తాల దిగుబడి నమోదయింది. వాస్తవానికి ఎక్కడ 20 బస్తాల దిగుబడి వచ్చిన రైతులు లేనే లేరని వారే చెబుతున్నారు. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో అకాల వర్షాలు గింజ తాలుగా…

Read More

పశువుల దాణ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని కాపవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 60 మంది రైతులకు సగం ధరకే దాణ అందజేశారు. దాణ50 కేజీలు బస్తా అసలు ధర రూ.1110 లు. నియోజకవర్గ పరిధిలో 110 టన్నుల దాన సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ దాణ మొత్తం విలువ 24 లక్షల 42…

Read More

పడిపోయిన కొబ్బరి ధరలు రాలిపోయిన రైతు ఆశలు

పాలకొల్లు, యలమంచిలి, నవంబర్, 24 ( తెలుగు న్యూస్ పవర్)కొబ్బరి రైతులను ఊహల పల్లకిలో ఊరేగించిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు, వ్యాపారులు ఇందువల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి ధర చిల్లర వ్యాపారస్తుల దగ్గర 35 నుంచి 40 రూపాయలు వరకు నడిచింది. రైతుకు 25 రూపాయలు వరకు ధర ముట్టింది. గత రెండు సంవత్సరాలుగా, నెమ్మదిగా పెరుగుతూ వచ్చి, గరిష్ట స్థాయికి చేరింది. అయితే ధర పతనం ఒక్క రోజులోనే కుప్పకూలిపోయినట్టు వ్యాపారులు…

Read More

జగన్ నీటి లేఖపై నిప్పులు చెరిగిన- మంత్రి నిమ్మల

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ -2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శనివారం సాయంత్రం రాష్ట్ర జలవి వనరులశాఖమాత్యులు నిమ్మల రామానాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ ఆంధ్రరాష్ట్ర జలవనరులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ…

Read More