Telugu News Power

విద్యా వ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక మార్పులు – మంత్రి నిమ్మల

పోడూరు: డిసెంబర్ 5 (తెలుగు న్యూస్ పవర్) విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమ్మేళనం మూడో విడత సందర్భంగా జున్నూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విద్యాశా ఖామాత్యులు,నారా లోకేష్, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్య సమన్వయంతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ…

Read More

ఉపాధ్యాయుని సస్పెన్షన్

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని ఆగరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చల్లా రవికుమార్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుని పై అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఈ విచారణలో స్థానిక విద్యాశాఖ అధికారులు కాకుండా, బయట నుంచి వచ్చిన విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు సంయుక్తంగా,ఈ విచారణ చేసినట్టు సమాచారం. ఉపాధ్యాయునిపై వచ్చిన…

Read More

ఉద్యోగార్థులకు శిక్షణ

పాలకొల్లు: డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్)ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ అటానమస్ కళాశాల లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థుల కోసం ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభించారురు. విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వారం రోజులపాటు జరుగుతుంది. మహిళా సాధికార విభాగం, జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో…

Read More

వజ్ర సంకల్పం ముందు వైకల్యం ఓటమి

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) వైకల్యాన్ని ఎదిరించి నిలిచిన నిలువెత్తు స్ఫూర్తి వేదాంతం సదాశివమూర్తి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలానికి చెందిన, ప్రస్తుతం పాలకొల్లులో స్థిరపడ్డ వీరి జీవితం దివ్యాంగులకు ఓ ఆచరణీయ మార్గదర్శి. రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు మోకాలు వరకు తొలగించవలసి వచ్చింది. తీవ్రమైన శారీరిక బాధను మానసిక వేదనను తట్టుకుని నిలబడిన మేరు పర్వతం సదాశివమూర్తి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పట్టా పొంది, ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ వాహనాలను ఎంత…

Read More

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు

యమంచిలి:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల,ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు సాంస్కృతిగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రతిభ మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల పంపిణీ

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తో పాస్ కావాలని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి కోరారు. యుటిఎఫ్ ఉచితంగా పంపిణీ చేస్తున్న టెస్ట్ పేపర్ల వితరణ కార్యక్రమంలో భాగంగా ఏనుగులంక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వీరి సౌజన్యంతో ఇస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు…

Read More

విద్యార్థులు సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి-ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి

యలమంచిలి:డిసెంబరు,1 (తెలుగు న్యూస్ పవర్) ఈ ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం చదువు ఒక్కటేనని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ పేపర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సోమవారం మట్లపాలెం ఉన్నత పాఠశాలలో గోపి మూర్తి పుస్తకాల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. గోపి మూర్తి ఉన్నత విద్య ఈ ఉన్నత పాఠశాలలోనే సాగింది. విద్యార్థులు పుస్తకాలు తో పాటు తను ఉంటున్న సమాజ స్థితిగతులను కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ…

Read More

నూతన చట్టాలు తెలుసుకోవాలి

పాలకొల్లు:డిసెంబరు,1(తెలుగు న్యూస్ పవర్) భారతీయ న్యాయ సంహిత చట్టాల గురించి తెలుసుకోవాలని పాలకొల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి పృద్వి పిలుపునిచ్చారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో భారతీయ నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పృథ్వి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో…

Read More

బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం

యమంచిలి: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సోమవారం బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరించారు. కి అవగాహన కార్యక్రమంలో పాలకొల్లు లయన్స్ రూరల్ క్లబ్, ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్, సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనురాధ, డాక్టర్ ఎస్.వి.రంగారావు, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్…

Read More

ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ

పాలకొల్లు: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ వ్యాధి పై యువత అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆటాన్మస్ కాలేజీ విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పట్ల అపోహలు తొలగించి, సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ నిరోధక నినాదాలు చేశారు. ఈ ర్యాలీ…

Read More