పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకానికి, బెంగళూరు వాస్తవ్యులు, చిరంజీవి ధీరవ్ పౌలుక తిప్పారెడ్డి, చిరంజీవి
రిషి పౌలుక తిప్పారెడ్డి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. వీరు శ్రీ స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, వారికి దేవస్థానం తరఫున శేష వస్త్రం,శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,సూపరింటెండెంట్ వాసు, హోత హరి నారాయణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నిత్య అన్నదాన పధకానికి బెంగళూరు వాసులు రూ. లక్ష విరాళం.
నిత్యాన్నదాన పధకానికి విరాళం ఇచ్చిదాతలకు స్వామి వారి చిత్రపటం అందజేస్తున్న ఈ ఓ.