Skip to main content

Telugu News Power

పుట్టినరోజు వేడుకల్లో మంత్రి నిమ్మల వితరణ.

అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీజ పవన్ దంపతులు

పాలకొల్లు: ఏప్రిల్,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తల మునకలుగా ఉంటూ తన పర్యటనలో అందర్నీ పరుగులు పెట్టిస్తుంటారు. అయితే, శుక్రవారం కాస్త సడలింపు ఇచ్చి తమ కుమార్తె శ్రీజ, అల్లుడు పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అది కూడా సేవా కార్యక్రమం. అన్న క్యాంటీన్ వద్ద శ్రీజ పవన్ దంపతుల తో కలిసి పేదలకు స్వయంగా ఉచితభోజనం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కేక్ కట్ చేసి పంచారు. మొబైల్ క్యాంటీన్ ద్వారా ఆసుపత్రి వద్ద ఉన్న రోగుల సహాయకు ఉచిత భోజనం అందజేశారు. దంపతుల పుట్టినరోజు సందర్భంగా, చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, పాలవలస తులసీరావ్, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పెశ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, ఉన్నమట్ల కపర్తి, పాముల రజిని కుమార్, బొప్పన హరి కిషోర్, మామిడి శెట్టి పెద్దిరాజు, చినమిల్లి గణపతి రావు, బిట్ట లక్ష్మీనారాయణ, రావూరి అప్పారావు, పీతల శ్రీనివాస్ చరిత్ర పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

శ్రీజ పవన్ పుట్టినరోజు వేడుక

 

అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీజ పవన్ దంపతులు