అమరావతి: జూన్,9(తెలుగు న్యూస్ పవర్.కామ్)రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ శనివారం దాఖలు చేశారు. రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో, రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్
దేవ వరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద బాబు, ఎన్ ఈశ్వర రావు లు ప్రతిపాదించారు.
లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్.
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్న రమేష్