పాలకొల్లు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో సోమవారం స్థానిక కటిక వెంకటేశ్వరరావు కుమారుడు కటికి రాఘవ నాయుడు పుట్టినరోజు జరిగింది. సందర్భంగా శ్రీ స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు ద్వారా రూ. 1,01,116/-లు చెక్ అందజేసారు. వారిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు. వీరినకి ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ ఆశీర్వచనం చేసి, స్వామివారి అమ్మవార్ల కరుణాకటాక్షములు ఉండాలని ఆశీర్వచన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, పినిశెట్టి శ్రీనివాసు ధర్మకర్త, ఆలయ సూపరింటెండెంట్ పి . వాసు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి నిత్యాన్నదానానికి కటిక వారి రూ. లక్ష కానుక.
దాత కటిక వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులను సత్కరిస్తున్న చైర్మన్ రాము