శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమును సోమవారం తోట నారాయణరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. డాక్టర్ తోట నారాయణరావు ఇస్రో సైంటిస్ట్(జి),తిరుపతి వారు తల్లిదండ్రులు, సోదరి ( అమెరికా) కుటుంబ సమేతంగా శ్రీ స్వామి వారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉపముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు జనసేన పార్టీ జిల్లా నాయకులు, స్థానిక కనకదుర్గమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు వీరికి స్వామివారి అనుగ్రహ దర్శనం సహకరించారు.వారికి ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు శేషవస్త్రం, అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాసు, నాళము నాగ వెంకట సురేఖ, పి .వాసు, సూపరింటెండెంట్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ తోట నారాయణరావు.
నారాయణ రావు ను సత్కరిస్తున్న ఆలయ పర్యవేక్షకులు పి వాసు