Telugu News Power

జిల్లాలో పది పరీక్షలకు 24,127 మంది హాజరు.

భీమవరం: మార్చి, 16(తెలుగు న్యూస్పవర్.కామ్).పశ్చిమగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పేపర్, కొంతమేర కష్టంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సహాయం అందించటానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేసవికాలం కావటంలో పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విదధించారు. జిల్లాలో 132 కేంద్రాల్లో 24,127 మంది విద్యార్థులు…

Read More

పండగలకు నిధులు కేటాయించాలి-జిల్లా బిజెపి.

భీమవరం: మార్చి, 16(తెలుగు మూవీస్ పవర్.కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో రానున్న ఉగాది,వసంత నవరాత్రులు మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించి, తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలోని “జనతా-వారధి” జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఇంజటి వెంకటేశ్వర్లు ప్రతినిధి బృందం మరియు బిజెపి నేతలతోకలసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసారు.

Read More

ఆర్ఎస్ఎస్ పై అమెరికా కమిషన్ కన్నెర్ర.

అమెరికా: మార్చ్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్, భారత దేశానికి చెందిన ఆర్ఎస్ఎస్ పై కన్నెర్ర చేసింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ సోమవారం భారతీయ స్వయంసేవక్ సంఘ ఒక గూడచారి సంస్థ గా అభివర్ణించింది. ఈ సంస్థ పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశంలో మత స్వేచ్ఛ ఏ పరిస్థితుల్లో ఉందో నిజనిర్ధారణ చేయటానికి అనుమతించాలని కోరింది. భారతదేశాన్ని ఆందోళన కలిగించే దేశాల సరసన చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి…

Read More

వంట గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల మంత్రి మనోహర్ సమీక్ష.

అమరావతి: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కాం)ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అధికారులతో సోమవారం ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై సమీక్ష సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సిలిండర్ల సమయానికి సరఫరా, బుకింగ్ నుండి డెలివరీ వరకు జరుగుతున్న ప్రక్రియలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా…

Read More

ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ‘ఉప్పలపాటి’

భీమవరం: మార్చ్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు ఘనవిజయం సాధించారు. ఏపీ బార్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా, కేంద్ర సహాయ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ,న్యాయవాదులు, బిజెపి నాయకులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు. న్యాయవాద వృత్తిలో వారికి ఉన్న అపారమైన అనుభవం మరియు నిబద్ధత, బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదుల సంక్షేమానికి, వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.

Read More

సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.

న్యూఢిల్లీ: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్.కామ్)తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి. ఆయన రాసిన “అనిమేష” కవితా సంపుటికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. సిధారెడ్డి కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు…

Read More

సినిమా భారతీయ సంస్కృతిలో విడదీయరా అని ఓ బంధం. -పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

హైదరాబాద్: మార్చి,16(తెలుగు న్యూస్పవర్.కామ్)భారతదేశానికి, ముఖ్యంగాదక్షిణ భారతదేశానికి సినిమా ఓ అతి ముఖ్యమైన సాంస్కృతిక బంధమని పవర్ స్టార్, డిప్యూటీ ముఖ్యమంత్రి,పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఊస్తాద్, భగత్ సింగ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన వేడుకలో ప్రసంగించారు. ఒక్కో సినిమా మనిషిని చైతన్య పరిచి మళ్లీ ముందుకు నడిపిస్తుందని తన అనుభవాన్ని వివరించారు. సినిమా వల్ల ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్న, అది సమాజానికి మేలు చేస్తుందన్నారు. కర్ణాటకలో సినిమాలు బంద్ చేసినప్పుడు,…

Read More

మారేడుదళ ప్రదక్షిణలో విశేషంగా పాల్గొన్న భక్తులు.

పాలకొల్లు: మార్చి, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ వద్ద సోమవారం, ఏడు మారేడు దళములతో, ఏడు ప్రదక్షిణములలో మాడవీధులలో ప్రదక్షిణాలు భక్తులు ప్రదక్షిణలు చేశారు. సుమారుగా 350 మంది భక్తులు పాల్గొన్నారు. ఈకార్యక్రమం లో కార్యనిర్హవనాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాలు రామచంద్రరావు, పినిశెట్టి శ్రీనివాస్ ధర్మకర్త, సూపరింటెండెంట్ వాసు, ప్రధాన అర్చకులు కిష్టప్ప, పాల్గొన్నారు. రాత్రి, 7గంటలకు శ్రీ స్వామి వారి ధూప సేవ,7.30…

Read More

కళాక్షేత్రానికి 8 కోట్లు -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: మార్చి, 15(తెలుగు న్యూస్ పవర్.కామ్) నిర్మాణంలో ఉన్న నందమూరి- బొండాడ కళాక్షేత్రానికి 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లు కళా పరిషత్తు ఆధ్వర్యంలో 3రోజులపాటు జరిగిన నాటిక పరిషత్తు ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆదివారం రాత్రి హాజరయ్యారు. ఈ సభకు కళాపరిషత్ అధ్యక్షులు కే.వి.కృష్ణ వర్మ అధ్యక్షత వహించారు. బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్ స్వాగతం పలికారు. ఈ…

Read More

వేద పఠనం లో చరిత్ర సృష్టించిన దేవవ్రత్.

ముంబై: మార్చి ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మహారాష్ట్రలోని అహల్యనగర్‌కు చెందిన 19 ఏళ్ల వేద శుక్ల యజుర్వేద పండితుడు దేవవ్రత్ మహేష్ రేఖే సుమారు 200 సంవత్సరాల తర్వాత అత్యంత క్లిష్టమైన ‘దండక్రమ పారాయణం’ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. ఆయన శుక్ల యజుర్వేదంలోని సుమారు 2,000 మంత్రాలను 50 రోజుల పాటు విరామం లేకుండా, దోషరహితంగా పఠించి, శృంగేరి శారదా పీఠం సహా పలువురి ప్రశంసలు అందుకున్నారు. వేద పఠనంలో అత్యంత కఠినమైన…

Read More