ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.
పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక అద్ధేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న అతిపెద్ద 3 తరగతి గదులను విభజించి నిర్మాణం చేస్తారు. ప్రిన్సిపల్ ఛాంబర్ మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం పనుల నిమిత్తం 23.36 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు….