Telugu News Power

వాసవి క్లబ్ వారిచే సత్కారం.

పాలకొల్లు: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాసవి క్లబ్ ను జోనల్ అధ్యక్షులు, పాదర్తి వెంకట శివ నాగేశ్వరరావు గురువారం సందర్శించారు. ఈ స్నేహపూర్వక పర్యటనలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక అగ్ని మాపక దళ జిల్లా సహాయ అధికారి వైవి జానకిరామ్ ఆధ్వర్యంలో సిబ్బందిని వాసవి క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. అగ్నిమాపక దళం సేవా భావాన్ని కొనియాడారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. వృద్ధాశ్రమంలో రొట్టెలు కంచిపెట్టారు. పేదరాలకు గ్రైండర్, నిత్యవసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, అన్నదాన సమాజం చైర్మన్, కోశాధికారి తెరునాకుల కోటేశ్వరరావు, మాటూరి నరసింహమూర్తి, గాదె జనార్ధన గుప్త తదితరులు పాల్గొన్నారు.