పాలకొల్లు: జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాజకీయంగా ఎదుర్కోలేక, తన వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాల పై గత పది రోజులుగా చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, రాజకీయ కక్ష సాధింపులను జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, వైసిపి సీనియర్ నాయకులు మేకా శేషుబాబు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. తనను, మహిళలను కూడా చూడకుండా తన కుటుంబ సభ్యులను అవమాన పరచాలని, ఇబ్బంది పెట్టాలని ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని
న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలపై పోలీసులచే 41 నోటీసులు ఇప్పించారని తెలిపారు. విచారణ పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు చెప్పినట్టు, అంగీకరించాలని తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తనను నిర్బంధించి, అవమానకరంగా దూషించారని ఈ దుర్ మార్గంగా ఖండిస్తున్న ట్లు తెలిపారు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని భయపెడుతున్నారని శేషుబాబు తెలిపారు. చట్టాన్ని గౌరవించి, త్వరలోనే తన నిజాయితీని నీరూపించుకుంటానన్నారు. ఎవరో ఆరోపణలు సాకుగా తీసుకుని తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న దేవరపల్లి సీఐ, నలుగురు ఎస్సైలను శేషుబాబు తీవ్రంగా హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి ఎన్ని కోట్లకైతే తనపై ఆరోపణలు గుప్పించారో, అన్ని కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నట్టు వెల్లడించారు. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు పోలీసులు బలి కావలసి వస్తుందని శేషుబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధిస్తున్నారు. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు ఆరోపణ.
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న శేషుబాబు